Philosophy

సోక్రటీస్ (ఒక చిన్న కథ)

ముఖ్యంగా సోక్రటీస్ జీవిత లక్ష్యాన్ని, జీవిత విధానాన్ని మార్చివేసిన సంఘటన ఇది. 

ఒకసారి ఒక మిత్రుడితో కలిసి డెల్ఫీ వద్ద గల అపోలో దేవాలయానికి వెళ్ళాడు సోక్రటీస్. అక్కడ అపోలో తనను ఉపాసించే గణాచారి ద్వారా ప్రశ్నలకు సమాదానాలు చెబుతాడని, తన సందేశాలు వినిపిస్తాడు అని ప్రతీతి. 

గణాచారి (Oracle) “ఎవరు మీరు?” అని ప్రశ్నించింది. 

“నేను  సోక్రటీస్ . నాకు  తెలిసింది ఒకటే , నాకు ఏమీ తెలియదని” అన్నాడు సోక్రటీస్. 

“ప్రపంచంలో కెల్లా మహాజ్ఞాని ఎవరు?” అని పక్కన ఉన్న మిత్రుడు ప్రశ్నించాడు గణాచారి ని. 

“నిన్ను నీవు తెలుసుకో . మానవులలో సోక్రటీస్ కంటే మహాజ్ఞాని లేడు” అని గణాచారి దైవసందేశం వినిపించింది. 

ఈ సమాధానానికి సోక్రటీస్ నివ్వెరపోయాడు. తనకేమి తెలియదనే విషయం తనకి తెలిసినందుకే తనను మహాజ్ఞానిగా గణాచారి వర్ణించిందా? లేక నిజంగా తానూ అందరిలో తెలివయినవాడా?

ఇక, ఆనాటి నుంచి తన కంటే జ్ఞానిని వెదికి  పట్టుకోవాలని, డెల్ఫి గణాచారి మాట నిజం కాదని రుజువు చేయాలని పట్టుదలతో సోక్రటీస్ అన్వేషణ ప్రారంభించాడు . 

  • విశ్వదర్శనం  – పాశ్చాత్య చింతన  (శ్రీ నండూరి రామ్మోహన్ రావు గారు ) నుండి సేకరించడం జరిగింది
Tagged ,