పొరపాటు
Mumbai మహానగరం - మధ్యాహ్నం 12:00 PM
అఖిలేష్, తన డెస్క్ లో కూర్చుని ఏవో files చూస్తున్నాడు తన computer లో …
అంతలో .. తన phone రింగ్ అయ్యింది..ఫోన్ ఎత్తి .. hello..అన్నాడు
phone లో client PA..
“Mr. అఖిలేష్, ఈ రోజు 3:00 PM కి మీరు free గా ఉంటే… అగర్వాల్ గారిని కలవొచ్చు. ఈ రోజు కుదరదంటే రెండు నెలల తర్వాత appointment ఇస్తాము.”
అఖిలేష్, ఒక్క క్షణం అలోచించి , తన కంప్యూటర్ లో క్యాలెండర్ చెక్ చేసుకుంటూ … ఫోన్లో, “లేదు నేను ఈరోజే అగర్వాల్ గారిని కలుస్తాను.. ఈ రోజు appointment confirm చెయ్యండి”
ok అఖిలేష్ , మీకు అగర్వాల్ తో 3:00 PM to 4:00 PM appointment confirm, అని PA ఫోన్ పెట్టేసింది.
[అఖిలేష్, ఒక Financial Adviser, తన వృత్తిలో ఎంతో పేరు వున్న వ్యక్తి. అగర్వాల్ ఒక పెద్ద jewelry shop ఓనర్, తనకి ఇండియా అంతటా షాప్స్ వున్నాయి. ]
అఖిలేష్, వెంటనే, కొన్ని డాక్యూమెంట్స్ ప్రింట్ తీసుకుని , బ్యాగ్ సర్దుకున్నాడు, క్లయింట్ ని కలవడానికి.
క్లయింట్ వున్న చోటుకి , గంటా గంటన్నర ప్రయాణం, parking lot కి వచ్చి తన కార్ స్టార్ట్ చేసాడు..
తాను ఏ client దగ్గరికి వెళ్తున్న మొదట ఆగేది, తన మిత్రుడి తమ్ముడు కిషోర్ coffee shop దగ్గరే. ఆ కాఫీ షాప్ చాలా అధునాతనంగా ఉంటూ అన్నిసౌకర్యాలు ఉండడంతో, అక్కడ కాఫీ తాగుతూ, క్లయింట్ మీటింగ్ కి డాక్యూమెంట్స్ చెక్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతాడు. ఆ కాఫీ షాప్ లో ఉన్న ప్రతి స్టాఫ్ తనకు పరిచయమే. ఆ కాఫీ షాప్ పెట్టటానికి, కిషోర్ కావలిసిన surety ఇచ్చి లోన్ సహాయం కూడా చేసింది అఖిలేషే..
కార్ ని , కాఫీ షాప్ ముందు పార్క్ చేసి, లోపలి వెళ్ళాడు. కౌంటర్ లో వున్న supervisor ని కిషోర్ ఎక్కడ అని అడిగాడు. కిషోర్ బయటకి వెళ్లాడని చెప్పడం తో, తనకి కాఫీ పంపించమని supervisor కి చెప్పి … ఒక ఖాళీ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు ..
తనకి కుడి పక్కన టేబుల్ లో ఒక ఫామిలీ వుంది .. మొగుడు పెళ్ళాం, ఇద్దరు చిన్న పిల్లలు .. పిల్లలు చూడడానికీ 7-8 సంవత్సరాలు అనుకుంట .. కానీ వాళ్ళ అల్లరి చూస్తే అలా అనిపించడం లేదు .. ఒకళ్ళని ఒకళ్ళు వెంబడించుకుంటూ .. టేబుల్ చుట్టూ తిగుతున్నారు … ఆ మొగుడు పెళ్ళాం ఏ ఏమీ పట్టనట్లు .. ముచ్చట్లు చెప్పుకుంటున్నారు..
అఖిలేష్, తాను client meeting కి ప్రిపేర్ అవుతూ, డాక్యూమెంట్స్ చెక్ చేసుకుంటున్నాడు…
ఇంతలో, ఒక అందమైన యువతి కాఫీ ట్రె పట్టుకుని తన టేబుల్ దగ్గరికి వస్తుంది… ఆమెనే ఆలా దూరం నుంచే చూస్తున్న అఖిలేష్ కి మనసులో ఆనందం మరియు ఆశ్యర్యం … అంత అందమైన అమ్మాయిని అలా చూడడం చాలా ఆనందంగా వుంది, అందులోను తాను, తన టేబుల్ దగ్గరికి వస్తుంది, అలాగే ఆశర్యం తనని ఇంతకూ ముందు ఈ షాప్ లో ఎప్పుడు చూడలేదు … బహుశా తాను కొత్తగా జాయిన్ అయ్యి ఉంటుంది అనుకున్నాడు మనసులో …
ఆ అమ్మాయి కాఫీ ట్రే ని నిదానం గా టేబుల్ పైన కొంచెం దూరం లో పెట్టి …కాఫీ కప్ సాసర్ ని తనం ముందు పెట్టబోతు ముందుకు వంగింది …
ఇంకా తన అందాన్ని ఆస్వాదిస్తున్నాడు అఖిలేష్ తన మనసులో … ఈ రోజుల్లో ఎలాంటి మేకప్ లేకుండా ఇంత సహజసిద్ద అందమైన అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి తనకి …
[ అఖిలేష్ వయసు 30 సంవత్సరాలు , ఇంకా పెళ్లి కాలేదు… తనకి తండ్రి లేడు, అమ్మ తన సొంత వూరు అయిన పల్లెటూర్లో ఉంటూ పొలాలు చూసుకుంటుంది. తనకి వరుస అయ్యే మరదళ్ల్లు ఊళ్ళో వున్నా, వాళ్ళకి వున్న పట్నం పోకడలు నచ్చకపోవడం తో, వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. ప్రాక్టికల్ గా ఉండడం అఖిలేష్ మనస్తత్వం, కానీ తన తల్లి నుండి పెళ్లి చేసుకోమని ఒత్తిడి.
“మనలా మనం ఉండాలి … ఇంకోకిరిని అన్వయించడం సరి కాదు” అని బలం గా నమ్మే వ్యక్తి అఖిలేష్. ]
అలా ఆమెనే చూస్తున్న అఖిలేష్ కి ఒక్కసారిగా చురుక్కుమని కాలింది… కాఫీ కప్ ఒలికి .. వేడి వేడి కాఫీ తన మీద పడింది…
ఒక్క క్షణం క్రితం ఏమి జరిగిందంటే …
పక్క టేబుల్ లో వున్నా చిన్న పిల్లలు పరిగెడుతూ .. ఆ అమ్మాయి ని నెట్టేశారు… అదుపు తప్పి, ఆమె కాఫీ కప్పు ని టేబుల్ పైన వదిలేసింది …
ఆ కాఫీ అఖిలేష్ తన client కోసం తయారు చేసుకున్న డాక్యూమెంట్స్ పైన, తన డ్రెస్ పైన పడడంతో [అదీ client visit కు వెళ్లేముందు]
… అప్పటి వరకు ఎంతో ప్రశాంతం గా వున్న అఖిలేష్… ఏమి జరిగిందో తెలుసుకోకుండా, ఒక్కసారిగా what the h-ell…are you blind? you just ruined my appointment అని గట్టిగా అరిచాడు …
ఆ అమ్మాయి : sorry sir…sorry sir…అసలు ఏమి జరిగిందంటే…
అఖిలేష్ : stop nonsense… కళ్ళు నెత్తిన పెట్టుకుని పని చేస్తున్నావా… do you have any idea how valuable this meeting to me?
ఆ అమ్మాయి : నా తప్పు ఏమిలేదు sir…పక్క నున్న పిల్లలు… [అంటూ చెప్పబోతోంది…]
పక్క టేబుల్ father : ఇదిగో అమ్మాయి…నువ్వు తప్పు చేసి మా పిల్లల పైన చెప్తావా…కాఫీ షాప్ అంటే అన్నిరకలా customers ఉంటారు… నీకు సర్వ్ చేయడం తెలియక తప్పు చేసి…మా పిల్లల పైన నెట్టకు…
పక్క టేబుల్ mother : పదండి ఇక్కడి నుంచి అసలు.. ఇలాంటి place కి రావడం మనదే తప్పు…
అఖిలేష్ : ఇదిగో supervisor, ఇటు రా, ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకంటే…కిషోర్ బిజినెస్ చేసినట్టే…
ఇంతలో supervisor పరిగెత్తుకుంటూ వచ్చి… sorry sir…కిషోర్ గారు, వచ్చిన వెంటనే ఈ విషయం చెప్తాము..అంతలోపు మీరు కిషోర్ గారి office లో రెడీ అవ్వండి…మీ documents ని మా స్టాఫ్ ని పంపి..మల్లి printouts తీయిస్తాము…అని చెప్పాడు..
అఖిలేష్ అక్కడి నుంచి కిషోర్ రూమ్ కి వెళ్లి …రెడీ అయ్యాడు…ఇంతలో..తన documents ప్రింట్స్ కూడా వచ్చాయి…అవి మల్లా సరి చేసుకుని…తన client ని కలిసేటందుకు బయలుదేరాడు…