Comedy, Stories

నామకరణోత్సవం

ఇళ్లంతా హడావిడి .. తల్లితండ్రులు రాధా గోపాలం, తెగ మదన పడుతున్నారు ఇంకా పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలా అని.. 

అప్పుడే .. విమానం నుంచి దిగి వచ్చిన బాబాయి పిన్ని… బంధువులతో .. అక్కడి విశేషాల గురించి పూస గుచ్చినట్లు చెప్తున్నారు.. 

పూజారి  తన పూజా సామాగ్రిని…సర్దుకుంటూ … అటుగా వెళ్తున్న గోపాలం తల్లితో … “అమ్మ కొంచెం ఆ టీ నీళ్ళు పంపిస్తే … నేను భేషుగ్గా నా పని నేను చేసుకుంటాను…”

“ఒక్క నిమిషం ” పూజారి గారు  అంటూ… గోపాలం తల్లి వంటింటి లోకి గబ గబా వెళ్ళింది… 

గోపాలం తండ్రి .. “బావ గారు… రండి మిమ్మల్ని పరిచయం చేస్తాను” అంటూ … ఎవరో వస్తుంటే … వాళ్ళ దెగ్గరికి తీసుకుపోతున్నాడు … రాధ తండ్రి ని 

రాధ  తల్లి .. ఈ లోకం తో నాకు పని లేదంటూ … చంటి పిల్లాడిని ముస్తాబు చేస్తుంది  

ఇలా  ఇల్లంతా కోలాహలంగా వుంది … వచ్చిన బంధు వర్గం లో ఆడపడుచులు చీరలు , నగలు గురించి … , మగపడుచులు రాజకీయాల గురించి ఒకటే చర్చ… 

పూజారి  : (అప్పుడే ఏవో మంత్రాలు చదివి …) అమ్మ ….పిల్లవాడిని తీసుకువచ్చి ..ఇలా తల్లి వొడిలో పెట్టండి …

అమ్మమ ..నెమ్మదిగా…కదులుతూ … చంటోడిని … రాధ వొడిలో పెట్టింది …

 పూజారి  : అమ్మ పిల్లవాడికి  ఏమి పేరు పెట్టాలనుకుంటున్నారో … ఒక్క సారి ఆ పిల్లవాడి చెవిలో చెప్పండి …. 

అందరూ ..ఒక్కసారి … ఉలిక్కిపడి …ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు … 

బాబాయి , పిన్ని : ఏమిటీ …ఇంకా పేరు పెట్టలేదా ?…. ఇదే అమెరికాలో అయితే … పుట్టగానే పేరు పెట్టేయాలి …. ఎమాటకి ఆమాటే … ఆ system ఏ వేరు ….

 అమ్మమ్మ : ఏంటీ ? రాశి , నక్షత్రం ..చూపించకుండానే ? వదిన గారూ ..ఇది విన్నార ?

నానమ్మ : ఎం చేద్దాం!!!..అంతా ఫాస్ట్  generation… ఫాస్టు  పేర్లు … !!!

పూజారి  : (నీరసం తొ )…. అమ్మ  ఇంతకి  పిల్ల వాడి  పేరు  ఏమి  పెడుతున్నారు … 

నానమ్మ : మరే … ఆ విషయమే … చెప్దామనుకుంటున్న … ఈ చంటోడికి పేరు పెట్టడానికి …ఇంకా తర్జన భర్జనలు లు జారుగుతున్నై ….

పూజారి  : (ఆశ్చర్యం , అసహనం తో )… ఇంకాసేపట్లో దుర్ముహూర్తం వస్తుంది …తొందరగా కానివ్వండి ….ఇంకా ఆలస్యం చేస్తే నాకు ఎక్కువ సంభావాన ఇవ్వాలి .గుర్తుంచుకొండి (మనసులో నవ్వుకుంటూ )….

 తాత  (గోపాలం తండ్రి) : ఇందులో ఆలోచించేది ఏమి లేదు …. వీడు … నా వంశోద్ధారకుడు …నా వంశం లో మొదటి మనవడు… కాభట్టి .. మా వంశానికి మూలపురుషుడు ఐన నా తాత  పేరు  “త్రిలింగకోఠి” అని పేరు పెడదాం …. (కొంచం గర్వం తో ) 

(ఒక్క సారిగా … అందరు ఉలిక్కిపడారు …) 

గోపాలం : అబ్బా  ..!!! అని అరిచాడు …. ( రాధ  అంత గట్టిగా గిల్లింది మరి … అ పేరు విని …. “త్రిలింగకోఠి”)

గోపాలం : నాన్న … ఆ పేరు ..ఈ రోజుల్లో ఈ పేరు పెడితే …ఎలా నాన్న !!! (కోపం , భయం  ఆపుకుంటూ )…. ఈ రోజుల్లో అంతా  modern పేరు … అదీ మూడు అక్షరాల్లో పవన్ , మహేష్ , ప్రభాస్ … అని  పెట్టుకుంటున్నారు … మరీ “త్రిలింగకోఠి” అంటే కష్టం నాన్న….. 

తాత  (గోపాలం తండ్రి) : నువ్వు చెప్పే పేరులో … మూడు అక్షరాలే … వున్నై …. నీ చెప్పే పేరులో … మూడు లింగాలు… ఒక కోటి (డబ్బులు) ..వున్నై … ఇప్పుడు చెప్పు… ఎవరి పేరు “RICH” గ వుందో ….

(గోపాలం కి.. కాసేపు కళ్ళు తిరిగాయి ….) 

నానమ్మ : అరె  గోపాలం ..  నువ్వు, మీ నాన్న .. ఏ పేరు ఐనా … పెట్టుకోండి …. కాని మన కుల దైవం “వెంకటేశ్వర స్వామి”.. పేరు వచ్చేలా… ఆదీ  ముందు ఉండేలా   చూడండి … 

అమ్మమ్మ : మరే!! … నాకు కూడా … నాగు పాము … కల్లో కనిపించి … పుట్టబోయే బిడ్డకు … తన పేరు పేట్టుకోమని చెప్పింది … (సత్యప్రమాణంగా నాగు పామే  మాట్లాడింది … )… ఎలాగూ నక్షత్రం ప్రకారం … పేరు “నా” అక్షరం తోనే మొదలు అవ్వాలి అని జోతిష్యుడు  చెప్పాడు …. 

పూజారి  : అంటే ఇప్పుడు బాబు కు పెట్టబోయే పేరు  “నాగ వెంకట త్రిలింగకోఠి“… అంతేనా అమ్మ గారు ? (పేరు పలకటానికి కష్టపడుతూ ..) 

తాత  (గోపాలం తండ్రి ) : పూజారిగారు .. మీరు ఇంటి పేరు “ఎండమూరి ” మరిచిపోయారు!! … “ఎండమూరి నాగా వెంకట త్రిలింగకోఠి”.. అని నామకరణం .. జరిపించండి…..

(గోపాలం, రాధ కి… ఒక్క సారిగా … SHOCK కొట్టింది ….ఆ పేరు విని ) 

బాబాయి : What is this  name?  కనీసం  ఇది PASSPORT  లొ ఐనా .. పడుతుందా … ? (ఎదురు చెప్పలేని స్థితిలో ..!)… అన్నయ్యా … నువ్వేమి  భయపడకు … ఎలాగు మీరు రేపో మాపో … అమెరికా వస్తున్నారు ….అక్కడ … పేరు ..ఎంత  మోడరన్ గా వున్నా, నీ పేరు మారిపోతున్ధి… for example…నా పేరు కళ్యాణ్ … కాని నన్నంతా .. “క్యాల్” అని పిలుస్తారు  (తెలుగు వాళ్ళు కూడా !!!)….నీ పేరు గోపాలం … కదా .. నిన్ను గోపీ (go pee)…..అని అంటారు … ఇందులో ..ఆలోచించకుండా … ఏదో ఒకటి ..సరె అను ….

 గోపాలం : (ఒక్క సారిగా …ఉలిక్కిపడినట్టు లేచి  )… పూజారిగారు … “ప్రకాశం”  అనే పేరుతో .. నామకరణం జరిపించండి…. (కొంచెం  serious గా)

అందరు (రాధ, గోపాలం  మినహా )…. నిశ్చేష్టులై … చూస్తున్నారు …

 గోపాలం : మా వాడికి … కావలిసింది … అర్థవంతమైన .. తెలుగు ..పేరు … అంతేకాని … వంశాలు, జాతకాలు , దేవుళ్ళు కాధు…. !!!

మా వాడి …పేరు , భవిష్యత్తు … “ఆంధ్ర  కేసరి ” లా…  “ప్రకాసించాలని”… అంత గొప్పవాడు  కావాలని … కోరుకుంటూ … ఈ పేరు పెడుతున్నాను … …

వంశాలు, ఇంటిపేర్లంటూ .. మా వాడు కొందరివాడు గా ఉండకూడదు … తెలుగువాడి గా … అందరితో వుండాలి …

జాతకాలు, నక్షత్రాలు … అనే విశ్వాసాలు … కన్నా … “కష్టే ఫలి”… అని నా బిడ్డ  నేర్చుకోవాలి …

నా దేవుళ్ళు… అనేకన్నా …. అందరి దేవుళ్ళు నాకు దేవుళ్ళు … అని నా కొడుకు  అనుకోవాలి ….

అందుకే … “ప్రకాశం” అనే పేరు పెడుతున్నాను ….

🙂  —- అందరూ ఆనందం …. “ప్రకాశం” నామకరణం ——-:) 

Tagged , ,