ప్రేమ
మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు అఖిలేష్ .. గుండె నిండా ఆమె జ్ఞాపకాలు … చాలా సేపు నిద్రపట్టలేదు ఆ జ్ఞాపకాలతో …
తనలో తను నవ్వుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు…. తాను ఎలాంటి అమ్మాయిని అయితే ఇష్టపడుతాడో … అలాంటి అమ్మాయి పరిచయం అయినందుకు …ఆనందం లో మునిగిపోతున్నాడు ..
చివరికి ఎలాగో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది…
[పక్క రోజు 11:30 AM]
లేటుగా వచ్చాడు ఆఫీస్ కి అఖిలేష్…
వచ్చిన వెంటనే .. అశోక్ బైక్ రిపేర్ కోసం ఆఫీస్ బాయ్ ని పంపాడు ..
అందరితో మాట్లాడుతున్నాడు… పని చేసుకుంటున్నాడు .. కానీ తన ద్యాస అంతా మొబైల్ ఫోన్ పైనే ..
చిన్న మెసేజ్ వచ్చిన అలర్ట్ అయిపోతున్నాడు … కాల్ వచ్చిందంటే .. ఎంత పెద్ద మీటింగ్ అయినా మధ్యలోనే బయటికి వచ్చేస్తున్నాడు …
రాంగ్ కాలర్స్ , మార్కెటింగ్ కాలర్స్ … అయితే.. వాళ్ళతో “పని లేదా ..?” అని ఫోన్ లో గొడవపడుతున్నాడు …
ఇదంతా గమనిస్తున్న అశోక్ … “సార్, ఏమైంది .. ఎందుకు ఇంత చిరాకుగా వున్నారు..”
అఖిలేష్: “ఏమి లేదు అశోక్, i am ok…, ఆ!!! ….నీకు మీ గల్లీలో ఉండేవాళ్ళ గురించి బాగా తెలుసా ? specially మీ గల్లీ మొదట్లో … ఎవరు ఉంటారు .. వాళ్ళ ఫోన్ నెంబర్ ..etc“
అశోక్: [అయోమయం తో ].. తెల్వదు సార్ .. ఎంతో మంది వస్తుంటారు .. పోతుంటారు … వాళ్ళ డిటైల్స్ మనకెలా తెలుస్తాయి … అయినా ఎందుకు అడుగుతున్నారు సార్ ..
[అంతలో అఖిలేష్ ఫోన్లో...డింగ్ మని మెసేజ్ నోటిఫికేషన్]
అఖిలేష్: [mobile చూసుకుంటూ..]
”ఏమి లేదులే అశోక్..ఊరికే అడిగాను…నీతో తర్వాత మాట్లాడతాను..” అంటూ ఆఫీస్ లాబీ లోకి వచ్చాడు..
ఫోన్ లో మెసేజ్ నోటిఫికేషన్ పైన నొక్కాడు…
ఏదో..తెలియని నెంబర్ నుంచి మెసేజ్ “can i call you?” అని…
అఖిలేష్..”yes” అని టైప్ చేసి…send చేయబోయి..ఇలా కాదు అని…ఆ నెంబర్ కి..డైరెక్ట్ గా కాల్ చేసాడు..
[ఫోన్ రింగవుతుంది]
“హలో” [అంటూ ఆడగొంతు]
“హలో..నేను అఖిలేష్..మీ కాల్ గురించే వెయిటింగ్…”
అలేఖ్య: “నాకు తెలుసు మీరు అఖిలేష్ అని … కానీ అది నేనే అని మీకు ఎలా తెలుసు?” [అటు నుంచి ఫోన్లో నవ్వుతూ]
అఖిలేష్: “కొన్ని అలా తెలిసిపోతుంటాయి…” [నవ్వుతూ …] [మనసులో ...నువ్వు తప్ప వేరే ఆలోచన లేదు కాబట్టి అనుకున్నాడు అఖిలేష్]
అలేఖ్య: “రాత్రి క్షేమంగా చేరుకున్నారా ఇంటికి .. మీ కాలు ఎలా వుంది ? “
అఖిలేష్: “hmm… పర్లేదు .. మీ వైద్యం బాగా పని చేసింది …”
అలేఖ్య: “నాదేముంది … thanks to the patient…వైద్యం చేయించుకున్నందుకు”
[నవ్వుకున్నారు ఇద్దరూ ]
అఖిలేష్: “ok.. coming to the point..నేను కిషోర్ తో అంతా మాట్లాడేసాను … మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు జాయిన్ అవ్వచ్చు”
అలేఖ్య: “ok…కానీ నేను జాబ్ గురించి కాల్ చేయలేదు…మీరు ఎలా ఉన్నారు ..ఇంటికి క్షేమంగా వెళ్ళారా లేదా? … మీ కాలికి తగిలిన గాయం తగ్గిందా లేదా? అని కాల్ చేసాను “
అఖిలేష్: “ i am perfectly fine…చెప్పను కదా .. మీ వైద్యం బాగా పని చేసింది అని …”
అలేఖ్య: “good to hear that…నేను వేరేదో పని చూసుకోగలను .. నాకు ఈ recommendations తో జాయిన్ అవ్వడం ఇష్టంలేదు…”
అఖిలేష్: “no no…please ఆలా అనొద్దు … మీ జాబ్ నా తొందరపాటు వల్ల పోయింది … నా తప్పు ని సరి చేసుకోటానికి .. నాకు ఇదే మంచి సమయం …నాకు నిన్న రాత్రే మీ వ్యక్తిత్యం గురించి బాగా అర్థం అయింది ..నేనేదో మీకు ఉపకారం చేస్తున్నట్లు అనుకో వద్దు… ఇది మీ తెలివితేటలకు తగిన ఉద్యోగం కాక పోయినా … మీరు ఆశించే జీవితాన్ని ఇచ్చే ఉద్యోగం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను… “
[అటు నుంచు ఫోన్లో … అలేఖ్య ]
అలేఖ్య: “సరే అలాగే … నేనెప్పుడూ జాయిన్ అవ్వాలి? .. కిషోర్ గారి నెంబర్ ఉంటే చెప్పండి .. నేను ఆయనతో మాట్లాడుతాను..”
అఖిలేష్ : “అవసరం.. లేదండీ .. అన్ని నేను చూసుకుంటాను .. నాకు ఫోన్లో టచ్ లో ఉండండి చాలు … ఇది .. మీ నెంబరేనా .. ఈ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చా… ?
అలేఖ్య : [మనసులో నవ్వుకుంటూ ]
“అవును .. ఇది నా నెంబరే…మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు .. thanks for your help…మరి ఇక కాల్ కట్ చేద్దామా?”..
అఖిలేష్ : ఇంకేంటి సంగతులూ?
అలేఖ్య : [నవ్వుకుంటూ]
“చెప్పండి , ఇంకేంటి సంగతులూ … “
[ఇద్దరికీ .. ఏమి మాట్లాడాలో తెలియట్లేదు … కానీ ఫోన్ కట్ చెయ్యాలని ఇద్దరికీ లేదు ]
[ఇంతలో … అశోక్… లాబీ లోకి పరుగున వస్తూ.. ]
అశోక్: “సార్ … మిమ్మల్ని పెద్ద బాస్ పిలుస్తున్నారు … “
అఖిలేష్: “అలేఖ్య గారు… నేను మీకు తర్వాత కాల్ చేస్తాను “ అని ఫోన్ కట్ చేసి..ఆఫీస్ లోకి వెళ్ళాడు ..
[సాయంత్రం 5:30 PM]
అఖిలేష్ .. ఆఫీస్ నుంచి బయటికి వస్తూ .. కిషోర్ కి కాల్ చేసాడు ..
కిషోర్ : హలో అన్న .. ఎలా ఉన్నావ్ ?
అఖిలేష్ : నేను బాగున్నా కిషోర్.. నువ్వెలా వున్నావ్ .. ? బిసినెస్ ఎలా వుంది ?
కిషోర్: బిజినెస్ గురించి నీకు తెలిసిందే కదా అన్న…just breakeven
అఖిలేష్: hmm…అదిసరే…నీకు గుర్తుందా…కొన్నివారల క్రితం..నా పైన coffee వొలికిందని..ఒక అమ్మాయిని…ఉద్యోగం లోంచి తీసేసాం…ఆఅమ్మాయి ఆచూకీ తెలిసింది…నేను ఆమెతో మాట్లాడాను … నువ్వు వెంటనే ఆమెని జాయిన్ చేసుకోవాలి …
కిషొర్ : అన్నా .. రెండు రోజుల క్రితమే … ఇద్దర్ని పనిలో చేర్చుకున్న .. ఇంకొకళ్ళు అంటే నాకు బడ్జెట్ ఎక్కువవుతుంది.. నా బిజినెస్ కి లాభం కాదు … లేదు నువ్వు మాటఇచ్చేశాను అంటే.. ఆ ఇద్దరిలో ఒకరిని తీసేసి .. ఈమెను జాయిన్ చేసుకుంటాను …
అఖిలేష్ : ఒహ్హ్ అవునా [ కొంచెం అలోచించి ]
… నేను చెప్పానని నువ్వు ఎవరిని ఉద్యోగం లోంచి తీయద్దు … ఈమెని కూడ జాయిన్ చేస్కో … ఆమెకిచ్చే శాలరీ నేను pay చేస్తాను .. నేను ఇలా pay చేస్తున్నట్లు ఆమెకి చెప్పకు…
కిషొర్: [అయోమయం తో]
…ఎందుకన్నాఇదంతా?
అఖిలేష్ : అదంతే…నీకు పోను పోను తెలుస్తుంది…
కిషోర్ : [సగం అర్థం అయ్యి అర్ధంకానట్లు]
సరే అన్న…రేపు పంపించు… నేను షాప్‌లోనే ఉంటాను..
అఖిలేష్: సరే…thank you Kishore..
అని కాల్ కట్ చేసాడు…
[రాత్రి 9:30 PM ]
[అలేఖ్య ఫోన్ రింగవుతుంది … ]
అలేఖ్య : [ఫోన్ ఆన్సర్ చేస్తూ]
హలో ..
అఖిలేష్ : నేను అఖిలేష్ …
అలేఖ్య : హ్మ్మ్ తెలుసండి …
అఖిలేష్ : ఏమి లేదు … రేపు మీరు coffe shop లో జాయిన్ అవ్వచ్చు .. నేను అంతా మాట్లేడేసాను…మీకు ఎంత శాలరీ కావాలో అడగండి … కిషోర్ కాదనడు … ఇంకా మీ గురించి చెప్పాను .. అదే flexible hours, employee respect..etc
అలేఖ్య : ఓకే థాంక్స్ ..అండి …
అఖిలేష్ : ఇంకేంటి సంగతులూ?
[ఇలా వాళ్ళ సంభాషణ అర్థ రాత్రి 2 గంటల వరకు సాగింది అలా…ఫోన్లో ]