Series, Stories

అజ్ఞాత అతిధి – Part 4

పరిచయం 

[రాత్రి : 10:00 PM..వర్షం కొంచెం కొంచెంగా ఎక్కువవుతుంది] 

అఖిలేష్: హలో అలేఖ్య గారు … నన్ను గుర్తుపట్టారా … ? 

[అలేఖ్య ఆశ్చర్యం తో .. లేదు అని తలా ఊపింది.. ] 

అఖిలేష్: నేను…ఆ రోజు coffee shop లో …మీరు నాకు కాఫీ ఇస్తుంటే …అది వొలికి నా మీద పడింది … నేను ఏమి జరిగిందో తెలుసుకోకుండా పెద్ద గొడవ చేసాను … 

అలేఖ్య: ఓహ్ మీరా!!! … నా పేరు మీకు ఎలా తెలుసు ? ఇక్కడేం చేస్తున్నారు..?

అఖిలేష్: నాతో పాటు పని చేసే వ్యక్తి… ఇక్కడ దగ్గరలోనే ఉంటాడు … అతన్ని డ్రాప్ చేద్దామని వచ్చాను… 

తిరిగి వెళ్లబోతుంటే .. ఇలా సైకిల్స్ అడ్డంగా పడిపోయాయి .. ఇంతలో మీరు వచ్చారు

మీ పేరు కిషోర్ చెప్పాడు … 

..sorry..అండి … ఆ రోజు నేను కొంచెం అతిగా ఆవేశపడ్డాను … 

అలేఖ్య : కొంచెం ? 

అఖిలేష్ : కొంచెం  కాదు … కొంచెం ఎక్కువే … [తప్పు చేసిన భావనతో]

అలేఖ్య :[కొంచెం కోపం… కొంచెం అమాయకత్వం తో]

ముందు ఈ సైకిల్స్  పట్టుకోండి …బరువంతా నా మీద వదిలేశారు .. 

[ఇద్దరు కలిసి … ఆ కింద పడ్డ సైకిల్స్ ని తీసి పక్కకి పెడుతున్నారు... జోరున వర్షం పడుతోంది …  తడిసి ముద్దవుతున్నారు… 

ఆ సైకిల్స్ హ్యాండిల్స్ ఒక దానిలో ఒకటి ఇరుక్కు పోయి … ఒక పట్టాన రావట్లేదు..

అఖిలేష్ కాలి నెప్పిని భరిస్తూ … చిన్న గా మూల్గుతూ … కుంటుతున్నాడు ]

[అలేఖ్య గమనించింది… అఖిలేష్ కుంటుతూ ఉండడాన్ని .. ]

అలేఖ్య : ఆ రోజు, బాగానే నడుస్తున్నారుగా… ఇప్పుడేమైంది .. కుంటుతున్నారు …  

అఖిలేష్ : ఇందాకే గంట క్రితం.. ఒక చిన్న దెబ్బ తగిలింది ఆఫీస్ దగ్గర… ఫ్రెండ్ కి హెల్ప్ చేయబోయి కింద పడ్డాను .. 

అవునూ… ఇందాక నేను గుర్తు లేదన్నారు… ఇప్పుడేమో నేను ఆ రోజు ఎలా నడిచానో చెప్తున్నారు… 

అలేఖ్య : మీకు హెల్ప్ కావాలా ? లేదా సమాధానం కావాలా ?

అఖిలేష్ : … sorry…sorry… ఈ టైం లో … మీ హెల్ప్ చాలా అవసరం నాకు … please help..

[కొంచెం కొంచెం గా…  వర్షం ఎక్కువవుతుంది.. అఖిలేష్ నిలుచోటానికే చాలా ఇబ్బంది పడుతున్నాడు]

అలేఖ్య: చిన్న దెబ్బ అన్నారు … మరీ అంతలా కుంటుతున్నారు? అసలు ఏమైంది ?

[అంటూ తన మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి … అఖిలేష్ కాళీ వైపు చూసింది .. ప్యాంటు మోకాలి నుంచి కింద వరకు రక్తం మరకలు ]

అలేఖ్య : మీరు చూసుకున్నారో లేదో… మీ మోకాలి పైన రక్తం కారుతుంది ..  

అఖిలేష్ : ఒహ్హ్ అవునా!!! … చూసుకోలేదు … 

అలేఖ్య : నిలుచోవడానికే కష్ట  పడుతున్నారు.. ఇంటి వరకు వెళ్ళగలరా ? కార్ లో first aid కిట్ ఉందా?

అఖిలేష్ : first aid లేదు కార్ లో … అయినా పర్లేదు.. నేను వెళ్లిపోగలను .. 

[ఒక్క సారిగా వర్షం మరింత ఊపు అందుకుంది..గాలి కూడా తోడవటం తో.. ఒక్క సారిగా power కూడా పోయింది… 

అప్పటి వరకు … వెలుగుతూ ఆగిపోతూ వున్న street light  కూడా శాశ్వతం గా ఆగిపోయింది  ]

అలేఖ్య : ఈ చీకట్లో  పైగా  ఈ వర్షం లో …సైకిల్స్ తీయడం కష్టం… 

ఒక పని చేయండి… అదిగో  అదే నా ఇల్లు [10 ఆడుగుల దూరం లో ]

.. ఈ వర్షం తగ్గేంత వరకు ..నా ఇంట్లో ఉండండి…. అక్కడ first aid చేసుకుందురు గాని… 

అఖిలేష్ : అయ్యో…మీకెందుకు ఇబ్బంది..పైగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది.. పర్లేదు..నేను కార్ లో కూర్చుంటాను వర్షం తగ్గేంత వరకు ..

అలేఖ్య : నాకెలాంటి ఇబ్బంది లేదు … నా కంటూ ఎవరు లేరు … కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళు లేరు…  

మీరు కార్ లో కూర్చోవచ్చు …కానీ ఇంటికొస్తే .. కనీసం మీ కాలికి first aid అన్నా దొరుకుతుంది… ఇక మీ ఇష్టం … 

అఖిలేష్ : అయిష్టం గానే …సరే అంటూ తలా ఊపాడు..

అలేఖ్య: పదండి అంటూ…తన ఇంటివైపు అడుగులు వేస్తుంది…

[అఖిలేష్ కార్ లాక్ చేసి...తన వెనకాల కుంటుతూ వెళ్తున్నాడు..

అలేఖ్య ఒక ఇంటి ముందు గేట్ తెరిచి...పక్కగా ఉన్న మెట్ల పైకి గబగబా వెళ్తుంది…

అఖిలేష్ కూడా...మెట్లుఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు...తన దెబ్బతగిలిన కాలితో..]

అలేఖ్య: [వెనక్కి తిరిగి] .. అయ్యో..sorry…అంటూ రెండు మెట్లు వెనక్కి దిగి … అఖిలేష్ పక్కకి వచ్చి ఒక చేతితో అఖిలేష్ కుడి చెయ్యి పట్టుకుని … ఇంకో చేతిని … అఖిలేష్ ఎడమ భుజం పైన  అదునుగా పెట్టింది … 

[ఒక అమ్మాయికి ఇంత దగ్గరగా ఉండడం… అఖిలేష్ కి ఇదే మొదటి సారి…ఆ చలిలో కొంత వెచ్చదనం దొరికింది…అఖిలేష్ కి]

అలా రెండు ఫ్లోర్స్ మెట్లు ఎక్కాక, వచ్చింది అలేఖ్య ఇల్లు…అది roof top pent house…

ముందంతా..కొంచెం ఖాళీ స్థలం…పూల మొక్కల కుండీలతో నిండిపోయింది..వెనుక..ఒక చిన్న రూమ్… చూడటానికి చాలా చిన్నది .. ఒకరిద్దరు కంటే ఎక్కువ ఉండలేరు .. అంత చిన్నది… 

ఇద్దరు ఇంటి డోర్ ముందు నిలుచున్నారు… పక్కన కిటికీ తెరుచుకుని… గాలి వర్షం కి… కొట్టుకుంటుంది … 

అలేఖ్య .. ఆ కిటికీ డోర్ మూసేసి.. ఇంటి తాళం తీస్తుంది … 

ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు.. current లేకపోవడం తో… చిమ్మ చీకటి…

ఇంట్లోకి జల్లు పడుతుండడం తో తలుపు మూసేసి … అఖిలేష్ డోర్ దెగ్గరే… నిలుచున్నాడు … 

అలేఖ్య candels కోసం ఆ చీకట్లోనే  వేగంగా వెళ్తూ… జారీ పడ  బోయి … మల్లి తేరుకుంది .. 

రెండు candels  ని వెలిగించింది… 

ఆ candels వెలుగులో చూస్తున్నాడు అలేఖ్య ఇంటిని చూస్తున్నాడు .. అఖిలేష్ .. 

చిన్న రూమ్ … అందులోనే .. కిచెన్ .. ఇంకోపక్క బాత్రూం .. 

బయట వున్నవి చాలవన్నట్లు … ఇంట్లో కూడా చిన్న చిన్న చెట్ల కుండీలు … తన బెడ్ పైన … బెడ్ చుట్టూరా … పుస్తకాలు … ఆ బెడ్ ని చూస్తుంటే…పుస్తకాలతో చేసిన Game of Thrones సింహాసనం గుర్తుకొచ్చింది అఖిలేష్ కి…

అలేఖ్య : జాగ్రత్త గా చూసుకొని రండి .. ఆ పక్కన .. కొంచెం బురదగా వుంది… నేను కూడా జారాను .. 

అఖిలేష్: ఇంట్లో కి బురద ఎలా వచ్చింది .. అంటూ సందేహం గా చూస్తున్నాడు .. 

అలేఖ్య : ఇందాకటి నుండి కిటికీ తెరిచే  వుండింది కదా … ఆ వర్షం జల్లు పక్కనే  వున్నా చెట్ల కుండీల పై పడి … ఆ మట్టి కింద పడింది.. 

[నెమ్మదిగా పక్కనున్న ప్లాస్టిక్ కుర్చీ పైన కూర్చున్నాడు అఖిలేష్..

తాను ఒక టవల్ తో తల తుడుచుకుంటూ...ఇంకొక టవల్నిఅందించింది అలేఖ్య...అఖిలేష్ కి

అఖిలేష్...తల తుడుచుకోవటం పూర్తయింది....అలేఖ్య...first aid  కిట్ కోసం వెతుకుతుంది..

తనని అలానే చూస్తుండి పోయాడు..అఖిలేష్...ఆ తడిసిన బట్టల్లో అజంతా శిల్పంలా వుంది..అలేఖ్య..

ఇంత అందమైన అమ్మాయితో...అంత దురుసుగా ఎలా ప్రవర్తించానా...అంటూ మనసులో తనని తానూ తిట్టుకున్నాడు....]

అఖిలేష్: అలేఖ్య గారు…మీకు మనస్ఫూర్తిగా మరొక్కసారి…sorry..చెప్తున్నాను…ఆ రోజు నేను ఆలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు…

అలేఖ్య: [ ఇంకా వెతుకుతూనే]..జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి..దాని వల్ల వర్తమానం దెబ్బతింటుంది…

పొరపాటు..తప్పు..చూడడానికి ఒకేలా ఉంటాయి…మనకి ఓపిక, సహనం ఉంటేనే…వాటిని విడివిడిగా చూడగలం..

అఖిలేష్: coffee shop owner కిషోర్…నా ఫ్రెండ్ తమ్ముడే..నేను చెప్తే కాదనుడు… మీరు మల్లి అక్కడ జాయిన్ అవ్వచ్చు .. మీకు ఇష్టం ఉంటే… 

అలేఖ్య: దాని గురించి తర్వాత మాట్లాడదాం… ముందు మీ కాలి గురించి ఆలోచించండి … [ అంటూ first aid kit  ని అఖిలేష్ చేతిలో పెట్టింది]

[అఖిలేష్ తన ప్యాంటు ను… ఒక చేత్తో మోకాలి పైకి లాగి పట్టుకుని..ఇంకొక చేత్తో first aid dressing కి ట్రై చేస్తున్నాడు... కానీ బట్టలు తడిచి ఉండడంతో...ఒక్కచేత్తో ప్యాంటు ను లాగి పట్టుకోవటం కష్టంగా ఉంది...]

అది గమనించిన అలేఖ్య …. “మీరు ఏమి అనుకోనంటే…మీరు మీ రెండు చేతులతో..ప్యాంటు ను పైకి లాగి పట్టుకోండి…నేను first aid dressing చేస్తాను”  అంది..

సరే అని తల ఊపాడు…అఖిలేష్..

[అఖిలేష్, చైర్లోనే కూర్చుని...తన ప్యాంటు ను మోకాలి వరకు లాగి పట్టుకున్నాడు..రెండు చేతులతో.. 

తనకి ఎదురుగా .. అలేఖ్య, బెడ్ పైన కూర్చుని…కాలికి అయిన  గాయాన్ని శుభ్రం చేసి.. ఆయింట్మెంట్ పూస్తుంది .. ]

అఖిలేష్ : మీరు ఒక్కళ్ళే వుంటున్నారు … మీ అమ్మ నాన్న…?

అలేఖ్య :నా కంటూ పెద్దగా ఎవరూ లేరు… నా చిన్న తనం లోనే … అమ్మ చనిపోయింది … మా నాన్న కొంత కాలం క్రితం చనిపోయారు … 

అఖిలేష్: ohh sorry…

అలేఖ్య : no need to be sorry….నాకు అంత బాధగా ఏమి అనిపించలేదు మానాన్న చనిపోయినప్పుడు…

అఖిలేష్: మరి  brothers or sisters?

అలేఖ్య: ఉన్నారు…కానీ…[చెప్పడానికి ఇబ్బంది పడుతూ..]

అఖిలేష్ : its OK…మీకు ఇష్టం లేకపోతే … discuss చేయొద్దు .. 

నా విషయానికి వస్తే… నాన్న నా చిన్న తనం లోనే చనిపోయారు … మా అమ్మే నాకు అమ్మానాన్నా… చాలా కష్టపడింది ఒక్కతే  నన్ను పెంచడానికి .. కొంత వరకు మా మేన మామలు సహాయం చేసారు… ప్రస్తుతానికి తాను మా ఊర్లో నే  ఉంటూ … మా పొలాలు చూసుకుంటుంది .. 

అలేఖ్య : [మోనంగా వింటుంది]

అఖిలేష్ : మీకు మొక్కలు , పుస్తకాలు అంటే ఇష్టమా ? 

అలేఖ్య : మొక్కలు పెంచడం నా హాబీ … నాదృష్టి లో ప్రకృతి మాత్రమే దేవుడు …ఎలాంటి కానుకలు, ప్రసాదాలు, rituals కోరుకోకుండా … మానవాళికి నిస్వార్ధంగా ప్రాణ వాయువు ఇచ్చేవి ఇవే..  

అఖిలేష్: hmm nice…మరి పుస్తకాలు?

అలేఖ్య: just for knowledge…

[ మరొక్కసారి...పుస్తకాలని తీక్షణంగా చూసాడు..history, psychology, management, financial, literature, biography...etc అన్ని రకాలా పుస్తకాలు వున్నాయి...అంతలో పుస్తకాల వెనక అలేఖ్య ఫోటో..graduation dress  లో..ఇంకో చేతిలో medal పట్టుకుని…

ఆ ఫొటో లో  ఇంకొకరు ఎవరో వున్నారు...కానీ వాళ్ళు ఉన్న భాగం చించేసివుంది ..]

అఖిలేష్: మీరేం చదువుకున్నారు…

అలేఖ్య: ఏది మంచి…ఏది చెడో…తెల్సుకునేంత చదువుకున్నాను…

అఖిలేష్: i mean educational qualifications, degrees…?

అలేఖ్య: ఒహ్హ్ అవా…అవి ఉండేవి ఒకప్పుడు…కానీ ఇప్పుడు లేవు…అవి లేవు అనే బాధ కూడ లేదు.. 

అఖిలేష్ : [ఆశ్చర్యంతో] ఎందుకు?

అలేఖ్య: మన సమాజం లో చదువు అంటే…డబ్బులు సంపాదించడానికే అనే మూఢనమ్మకం ఎక్కువ ఉంది …

ఎంత ఎక్కువ చదువుకుని..ఎన్నిడిగ్రీలు సంపాదిస్తే…అంత సంపాదన…అనే ధోరణిలోనే జనాలంతా …విద్య ని కూడా వ్యాపారం  చేసేసారు… 

అందరూ చదువుకుంటున్నారు గాని …. ఏదయినా passion  తో ఒక విషయాన్ని తెలుసుకుందాం అనే ధోరణిలో ఎక్కడా చదువుకోవట్లేదు… ఏమి చదువుకుంటే ఎంత సంపాదన వస్తుంది అనే వాళ్ళ్లే ఎక్కువ …. 

ఈ చదువుకి , సంపాదనకి  వున్న సంబంధం వల్ల.. జనాలు సర్టిఫికెట్స్ కోసమో , మార్కుల కోసమో  చదువుతున్నారు తప్ప .. చదువు కున్నది మన జీవితాల్లో పాటించలేని పరిస్థితి .. 

అంతెందుకు ఒక పిల్లవాడు .. డార్విన్ సిద్ధాంతాన్ని చదివి… అది పరిక్షల్లో రాసి …మరుసటి  రోజు గుడికి  వెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు… “దేవుడా నన్ను పరీక్షల్లో పాస్ చేయించు అని”… అంటే ఆ డార్విన్ సిద్ధాంతాన్ని పరీక్షల్లో మార్కుల కోసమే చదివాడు… దాని నుంచి ఏమి నేర్చుకోలేదు … ఇది ఒక చిన్న ఉదాహరణ .. 

మనకున్న జ్ఞానాన్ని సర్టిఫికెట్స్ తో కొలవడం కరెక్ట్ కాదని..నా నమ్మకం…
 

అఖిలేష్ : మీరన్నది కరెక్టే … కానీ మీరూ అందరిలా ఆలోచిస్తే … మీకు మంచి ఉద్యోగాలు వచ్చి … మీ లైఫ్ బాగుంటుంది కదా … 

అలేఖ్య : నా లైఫ్ ఇప్పుడు కూడా  బాగుంది .. నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను .. నా అభిరుచులకు తగినంత సమయం కేటాయిస్తున్నాను … నాకు నచ్చింది చదువుకుంటున్నాను … 

మీరు చెప్పే … మంచి ఉద్యోగాలు .. ఒక చేతితో  డబ్బు ఇచ్చి …  ఇంకో చేత్తో మీ లైఫ్ ని తీసేసుకుంటున్నాయి … 

కొంచెం ఆలోచించండి … ఎవరికో డబ్బున్నవాడికి డబ్బు సంపాదించిపెట్టటం కోసం మనం 18 సంవత్సరాలు కష్టపడి  చదివి … మిగిలిన మన జీవితాంతం వాడికి చాకిరి చేస్తాం …తర్వాతా వాడిచ్చే నెల నెల జీతం ఎంత గొప్పదైనా …అది గడిచిపోయిన  మీ జీవితాన్ని వెల కట్టగలదా … ?

అందుకే నేను చేసే పని చిన్నదయినా, పెద్దదయిన … అది నా జీవితాన్ని ప్రభావితం చేయకూడదనుకుంటాను…  

అఖిలేష్ : ఓకే , అందుకేనా మీరు కాఫీ షాప్ లో జాయిన్ అయ్యారు … 

అలేఖ్య : అది ఒక కారణం…  కానీ అది ఒక్కటే కారణం కాదు .. 

అఖిలేష్ : నేను కిషోర్ తో  మాట్లాడుతాను … మీరు మల్లి అక్కడ జాయిన్ అవుతానంటే… 

అలేఖ్య: అలాగే , కానీ నేను పని చేసే చోట నా వ్యక్తిగత వివరాలు ఎక్కువ ఇవ్వడం నాకు ఇష్టం లేదు …ఆ విషయం లో మీరేదయినా హెల్ప్ చేస్తానంటే నేను తిరిగి జాయిన్ అవుతాను .. 

అఖిలేష్ : ఓకే.. 

[వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది … అలేఖ్య , అఖిలేష్ కాలికి కట్టు కట్టడం పూర్తయింది ]

[అలేఖ్య  లేచి వెళ్లి , కిటికీ తలుపు తెరిచి ] వర్షం తగ్గింది అంది  …

తిరిగి  వెనక్కి వస్తూ  … అప్పటికే బురదతో ఉన్న నేల పైన … ఒక్కసారిగా మల్లి జారింది … [ఈ సారి తనని తానూ కంట్రోల్ చేసుకో లేక పోయింది ].. 

ఎదురుగా  కూర్చున్న అఖిలేష్ పైన … పూర్తిగా పడిపోయింది… అలా పడడం తో ఇద్దరి పెదాలు ఒక్క క్షణం పాటు గుద్దుకున్నాయి …

ఇద్దరికీ..ఏమైందో అర్థం కాలేదు …కానీ అలానే ఉండిపోయారు ఒక్క క్షణమ్  వాళ్ళని వాళ్ళు మరిచి పోయి … 

అంతలో అంతరాయం …current వచ్చి, ఒక్కసారిగా light వెలిగింది.. 

అప్పటివరకు …  అఖిలేష్ ఒడి లో ఉన్న అలేఖ్య … స్పృహ లోకొచ్చి చట్టుక్కున లేచి నిలుచుంది .. 

ఇద్దరి ముఖాలు సిగ్గుతో ఎరుపెక్కాయి … మొహమాటం తో నోట్లోంచి మాట రావట్లేదు ఇద్దరికీ .. 

అఖిలేష్ : [పైకి లేచి నిలబడి .. బయలుదేరటానికి  సిద్దపడుతూ ] ఇది నా business card..రేపు ఒక సారి నాకు కాల్ చేయండి … నేను కిషోర్ తో మాట్లాడుతాను …

[అలేఖ్య… ఆ card  ని తీసుకుంటూ సరే అని చెప్పింది ]

కింద కారుకి అడ్డం గా ఉన్న సైకిల్స్ విషయం గుర్తుకొచ్చి ..”ఒక్క క్షణం, నేను వస్తున్నాను కిందకి” అని అఖిలేష్ తో పాటు … బయలుదేరింది … 

ఇద్దరు .. మెట్లు దిగి … కార్ కి అడ్డం గా వున్నా సైకిల్స్ ని తీసి పక్కన పెట్టారు… 

అఖిలేష్ కార్ లో కూర్చుని … రివర్స్ గేర్ వేసి … అలేఖ్య తో.. “రేపు మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను”.. అని  బయలుదేరాడు .. 

అలేఖ్య .. చిన్న చిరునవ్వుతో .. చేయి ఊపుతూ .. “సరే” అంది .. 

అఖిలేష్.. మెయిన్ రోడ్ పైకి వచ్చి , తన ఇంటికి ప్రయాణమయ్యాడు … 

మనసులో ఏదో తెలియని ఆనందం … కార్ కూడా మేఘాల్లో వెళ్తున్నట్లు వుంది అఖిలేష్ కి … 

Tagged , ,